TRINETHRAM NEWS

ఏసీఆర్ భృంగీ ఇంటర్నెషనల్ స్కుల్ లో ఘనంగా 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి

ముఖ్య అతిథులుగా హాజరైన
శాసనసభపతి గడ్డం ప్రసాద్ కుమార్
మాజీ హోం మంత్రి జానారెడ్డి
ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య

విద్యాసంస్థల చైర్మన్ మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్, కార్యదర్శి ప్రమీల .
పట్టణ ప్రముఖులు, నాయకులు

వికారాబాద్: 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వికారాబాద్ పట్టణం లోని ఏసీఆర్ భృంగీ ఇంటర్నెషనల్ స్కుల్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొదటగా జాతీయ తీవర్ణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల వివిధ సంస్కృతి కార్యక్రమాలు, దేశభక్తి చాటుతూ విన్యాసాలు చేసారు, ప్రముఖ గాయకుడు ఎపురి సోమన్న విద్యార్దులను ఉద్దెశించి రాజ్యాంగం యెక్క విశిష్టతను తన పాటలతో వివరించారు.
ఆరుఅడుగుల రాజ్యంగం ప్రతీని అతితులచేత ప్రమీల చంద్రశేఖర్ ఆవిష్కరింపచేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ విశిష్టతను విద్యార్థులకు, ప్రజలకు వివరించలనే ఆలోచన దృక్పథం గొప్పదని అన్నారు. రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్, పీడిత నిరుపేద ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు రాజ్యాంగాన్ని రచించారు అని, పరిపాలనకు, ప్రజలకు రాజ్యాంగం దిక్సూచి అని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వివక్షతను రూపుమాపడానికి రాజ్యాంగంతోనే సాద్యం అయిందని అన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని చదివి విలువలను తెలుసుకొని నడుచుకోవాలని అన్నారు . రాష్ట్రంలోనే మొదటి సారి రాజ్యాంగ పీఠిక విద్యార్థులతో ప్రమాణం చేపించాడం అభినందనీయం అన్నారు. అనంతరం క్రీడాలో గెలుపోందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల , జహిరాబాద్ ఎఎంసి చైర్మన్ ఎ సాయి చరణ్, డాక్టర్ ఏ చంద్రప్రియ, ఎ. సాయి ప్రణయ్, పాఠాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App