
డిండి(గుండ్ల పల్లి) మార్చి 20 త్రినేత్రం న్యూస్.
డిండి మండల కేంద్రంలోని హజరత్ ఖాజా సయ్యద్ షా యూసుఫొద్దిన్ 76వ ఊర్సే షరీఫ్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాలలో భాగంగా డిండిపట్టణానికి చెందిన బాబా శర్ఫోద్దీన్ ఇంటి నుండి ఘండం బయలుదేరి మహబూబ్ సుభాని దర్గా వద్ద ఫాతెహాలు నిర్వహించిన అనంతరం గంధం దర్గా వద్దకు చేరుకుంది, దర్గా వద్ద స్వామివారికి దట్టీలు పూలు సమర్పించి భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు.
అనంతరం ఇఫ్తార్ విందుతోపాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు.
రాత్రి నిర్వహించిన కవ్వాలి కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నది.
ఈ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతులు హజ్రత్ ఖాజా సయ్యద్ షర్ఫోద్దిన్, అబ్దుల్ ఖాదర్ , అయ్యూబ్, రషీద్, ఖయ్యాం, కలీం, రెహమాన్, నసీర్, దర్గా కమిటీ సభ్యులు సైదులు, నారాయణ, చంద్రయ్య, చాంద్ పాషా, కర్ణాకర్ రెడ్డి గంగాధర్, బాబా శర్ఫో ద్దీన్, మల్లయ్య, వెంకటయ్య, వెంకట్ రెడ్డి, మోహన్ లాల్, అహ్మద్, ఇంతియాజ్, అమీర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
