TRINETHRAM NEWS

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, ఏప్రిల్-02// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పేదలకు సమృద్దిగా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి పట్టణంలోని గ్యాస్ గోదాం వద్ద గల సుభాష్ నగర్ లో ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు తో కలిసి ప్రారంభించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రాష్ట్రంలోని రేషన్ షాపులలో తెల్ల కార్డు దారులకు ఇక నుంచి ప్రతి నెల సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు వానాకాలం వరి పంట కొనుగోలు సమయంలో రైతులకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ చెల్లించి సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు
కొనుగోలు చేసిన సన్న రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న 413 చౌక ధరల దుకాణాల ద్వారా ఇక నుంచి సన్న రకం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని, దీనికీ అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు
పెద్దపల్లి జిల్లాలో 4 లక్షల క్వింటాళ్ల సన్న రకం బియ్యం రేషన్ షాప్ లో వద్ద అందుబాటులో ఉంచామని, పేదలకు అవసరమైన మేర బియ్యం అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో అధిక సంఖ్యలో సన్న రకం ధాన్యం పండటంతో మన జిల్లా అవసరాలు తీరడంతో పాటు ఆసిఫాబాద్ జిల్లాకు కూడా ఎగుమతి చేశామని కలెక్టర్ తెలిపారు
నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎక్కడ క్వాంటిటీ లో తేడా రాకుండా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులు, రేషన్ డీలర్లను ఆదేశించారు. ప్రజల కూడా ప్రభుత్వ అందిస్తున్న సందర్భంగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు
కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్య మంత్రి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఉగాది పండుగ నుంచి పేదలకు సన్న బియ్యం రేషన్ ద్వారా సరఫరా చేస్తున్నారని అన్నారు
పెద్దపల్లి నియోజకవర్గం లో 55 రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా కార్యక్రమం జరుగుతుందని, అవసరమైన పరిస్థితులు ఉంటే అదనపు షాపులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
గతంలో ప్రజలకు రేషన్ ద్వారా దొడ్డు బియ్యం మాత్రమే సరఫరా చేశారని, దీని వల్ల చాలా వరకు రీసైక్లింగ్ జరిగిందని అన్నారు
కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే సంవత్సరానికి 2 వేల 700 కోట్లు భరిస్తూ పేదల కోసం సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ సరఫరా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతులకు 2 లక్షల రుణ మాఫీ, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అందించామని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం లో 59 కోట్ల 62 లక్షల రూపాయలను రైతు ఖాతాలలో బోనస్ క్రింద జమ చేయడం జరిగిందని అన్నారు
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, డి.యం. శ్రీకాంత్ , సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

6 kg of fine rice