TRINETHRAM NEWS

హాస్టల్‌కు ఆలస్యంగా వచ్చారని 500పైన్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసిన గురుకులపాఠశాల ప్రిన్సిపాల్ రంగారెడ్డి – కొందుర్గు ఎస్సీ గురుకుల పాఠశాలలో హాస్టల్‌కు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసిన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్
విద్యార్థులు క్రిస్మస్ పండగ కోసం సొంత ఊరికి వెళ్లి.. తిరిగి ఆలస్యంగా వచ్చారని పిన్సిపాల్, సిబ్బంది విద్యార్థులను హాస్టల్లోకి అనుమతించకుండా గేట్ వద్దే గంటల తరబడి నిలబెట్టారు
అంతేకాకుండా రూ.500 ఫైన్ వసూలు చేశారు. ఇదేమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే.. పిల్లలను టైంకి తీసుకు రాలేదు కాబట్టి పైన్ వేస్తున్నామని తెలిపారుఎక్కువ మాట్లాడితే గురుకుల పాఠశాలలోనే ఉంచుకోమని, ఇంటికితీసుకువెళ్లిపోండి అంటూ ప్రిన్సిపాల్ బెదిరించారు చేసేదేమీ లేక ప్రిన్సిపాల్ చెప్పినట్లు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App