
Trinethram News : లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) పేరుతో కాంగ్రెస్ నేతలు రూ.50 వేల కోట్లు దండుకునేందుకు స్కెచ్ వేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎల్‌ఆర్‌ఎస్ పేరిట పైసలు ఎవరూ చెల్లించొద్దని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తామని గత ఎన్నికల్లో హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు డబ్బులు ఎందుకు దండుకోవాలనుకుంటున్నారని నిలదీశారు.
ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేయాల్సిందేనని, లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పెద్దపల్లికి వచ్చిన సందర్భంగా సంజయ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
