TRINETHRAM NEWS

470 రకాల వెరైటీ వంటకాలు

యానాంలో కొత్త అల్లుడికి బాహుబలి విందు

Trinethram News : యానాం

గోదారోళ్ల మాటలకే కాదు.. ఆతిథ్యానికీ ప్రత్యేకత ఉంటుంది. పండగొచ్చిందంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు. మర్యాదలతో చుట్టాల్ని కట్టిపడేయటంలో గోదావరి జిల్లాలకు మించినవారు లేరంటే అతిశయోక్తికాదు. ఇక ఇంటికొచ్చిన కొత్తల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి.

కేంద్ర పాలిత ప్రాంతం యానాం వర్తకసంఘం గౌరవాధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్, వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు గతేడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్‌తో వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందునుఏర్పాటుచేసి ఆశ్చర్యపరిచారు.

శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, శీతల పానీయాలు…ఇలా సుమారు 470 రకాలు చిన్న చిన్న కప్పులలో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు కుమార్తె ఇద్దరినీ విందుకు ఆహ్వానించారు. ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు సాకేత్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. అత్తవారింట్లో ఏర్పాటుచేసిన అపురూప విందును ఊహించలేదని.. శాకాహారంలో ఇన్ని రకాల ఉంటాయని

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App