TRINETHRAM NEWS

వైసీపీ నుండి 30 చెంచు కుటుంబాలు టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

యర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీ నందు 30 చెంచు కుటుంబాలు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో వైసీపీ నుండి టిడిపిలోకి చేరడం జరిగింది. ముందుగా టిడిపి జెండా ఆవిష్కరించారు. అనంతరం వారికి ఎరిక్షన్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

భారీగా చెంచులు పాల్గొని గూడూరి ఎరిక్షన్ బాబు కి పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో యర్రగొండపాలెం మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.