
Trinethram News : AP EAPCETకు దరఖాస్తు గడువు ఈనెల 15న ముగియనుండగా, ఇప్పటివరకు 3.05 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సెట్ కన్వీనర్ ప్రొ.కె. వెంకటరెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,35,417, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 69,445, రెండు విభాగాల్లో కలిపి 892 చొప్పున అప్లికేషన్స్ వచ్చాయన్నారు. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
