TRINETHRAM NEWS

ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ (RSASTF)

అడవిలోకి చొరబడుతున్న వ్యక్తి అరెస్ట్

కడప జిల్లా ఉద్దిమడుగు అటవీ ప్రాంతంలో రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ దాడులు

Trinethram News : కడప జిల్లా ఉద్దిమడుగు అటవీ ప్రాంతంలో చొరబడుతున్న కొందరు వ్యక్తులను అడ్డుకున్న రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, 27 ఎర్రచందనం దుంగలతో ఒక మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకుంది. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్ సుబ్బారాయుడు సూచనలు మేరకు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీ జి. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ ఐ (ఆపరేషన్స్) చిరంజీవి కి చెందిన ఆర్ ఎస్ ఐ మురళీధర్ టీమ్, కడప జిల్లా ఉద్దిమడుగు అటవీ ప్రాంతంలో స్థానిక అటవీ శాఖ అధికారులు పి. ఇందిర, జి. కిషోర్ కుమార్ లతో కలసి కూంబింగ్ చేపట్టారు.

వీరు ఉద్దిమడుగు వైపు గల ఎర్రచందనము ఎంట్రీ, ఎగ్జిట్, డంపింగ్, లోడింగ్ పాయిoట్లను తనిఖి చేసుకొంటూ వెళ్ళుచుండగా. భాకరాపేట ఫారెస్ట్ సెక్షన్ పరిధి లో జామాయిల్ ప్లాంటేషన్ వద్ద కొందరు వ్యక్తులు ఎర్రచందన మొద్దులను మోసుకుని వెళుతూ కనిపించారు. వీరిని టాస్క్ ఫోర్స్ టీమ్ చుట్టుముట్టే ప్రయత్నం చేయగా వారు పారి పోయారు. వారిని వెంబడించినన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఒకరిని అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలో 27 ఎర్రచందనం దుంగలు, మోటార్ సైకిల్ స్వాదీనం చేసుకున్నారు. పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుబడిన వ్యక్తిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ కేసును ఎస్ ఐ రఫీ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

red sandalwood