అనారోగ్యంతో బాధపడుతున్న బాలుని వైద్య ఖర్చులకు2500 ఆర్థిక సహాయం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని బస్టాండ్ కాలనీకి చెందిన. దోనుగు రవీందర్ సృజన దంపతుల కుమారుడు 8 సంవత్సరాల దోనుగు హర్షవర్ధన్ కొన్ని ఏళ్ల నుండి అనారోగ్యంతో బాధపడుతుండగా, గోదావరిఖని తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పాకలపాటి శాంతి లత- కిరణ్ కుమార్ దంపతుల పెళ్లిరోజు పురస్కరించుకొని. శనివారం గోదావరిఖని బస్టాండ్ కాలనీలో హర్షవర్ధన్ నానమ్మ మల్లమ్మకు. వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, హర్షవర్ధన్ వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం గా 2500 రూపాయలను శాంతి లత అందించారు. అనంతరం వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్. సురభి శ్రీధర్ మాట్లాడారు. గోదావరిఖని బస్టాండ్ కాలనీ చెందిన రవీందర్ సృజన దంపతుల కుమారుడు 8 సంవత్సరాల బాలుడు హర్షవర్ధన్ కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతడాగా, కుమారిని వైద్య చేపించుకోలేని సోమత ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న శాంతి లత ఆర్థిక సాయం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు తమ పెళ్లిరోజులు పురస్కరించుకొని సేవ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. వారికి తమ సంస్థ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని సురభి శ్రీధర్ తెలిపారు. దాతలు ముందుకు వచ్చి హర్షవర్ధనకు సహాయ సహకారాలు అందించాలని దాతలను డాక్టర్ సురభి శ్రీధర్ కోరారు.
ఈ కార్యక్రమంలో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వేముల రమేష్, సామాజిక సేవకుడు డా, దేవి నర్సయ్య, ముల్కల ప్రసాద్, తాళ్ల సంపత్, తాటిపాముల దత్తాద్రి, గాదం శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App