
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 25 : బాలనగర్ కళ్యాణ్ నగర్ లోని శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, 15వ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి.ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా కోరుతూ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ని ఆలయ కమిటీ ప్రతినిధి పిఎస్ఎన్ మూర్తి ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం రమేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించి మహాదేవుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
మరియు శివరాత్రి సందర్భంగా జరిగే పూజా కార్యక్రమంలోనూ పాల్గొనాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, మోహన్ రెడ్డి, మధు గౌడ్, ప్రసన్న కుమార్, శివ చౌదరి, నరేందర్, మధు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
