TRINETHRAM NEWS

న్యాక్‌ ర్యాంకింగ్‌ కేసులో 10 మందికి రిమాండ్

నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలింపు.. న్యాక్‌ ర్యాంకింగ్‌ కేసులో 10 మందికి రిమాండ్ విధించింది కోర్టు.10 మంది నిందితులకు 15 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

Trinethram News : Andhra Pradesh : న్యాక్‌ రేటింగ్‌ ఎలా ఇస్తుంది?

విద్యాసంస్థల్లో అన్ని ప్రమాణాలు పాటిస్తున్నారా.. నాణ్యమైన విద్యను అందించేందుకు ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారనే దాన్ని బేస్ చేసుకుని న్యాక్‌ రేటింగ్‌ ఇస్తూ ఉంటుంది. వర్సీటీలు, కాలేజీలకు ఈ రేటింగ్‌ను చాలా కీలకంగా భావిస్తాయి.. అందుకే అడ్డదారిలో అక్రిడిటేషన్‌ రేటింగ్స్‌ కోసం ఇలా లంచాలు ఇస్తుంటాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూసినా ఈసారి న్యాక్‌ ఇన్‌స్పెక్షన్‌ బృందం చైర్మన్‌ సహా ఆ టీమ్‌లోని ఏడుగురు అరెస్ట్‌ అవడం సంచలనంగా మారింది. ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తూ లంచాలిస్తే రేటింగ్ ఇస్తున్నారనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

న్యాక్‌ రేటింగ్‌లో A++ అంటే టాప్ అన్నట్టు లెక్క. ఆ తర్వాత A+, B++ ఇలా రేటింగ్‌ ఇస్తారు. కొన్ని వర్సిటీల్లో ల్యాబ్‌లు, టీచింగ్ స్టాఫ్‌ లాంటి విషయాల్లో అరకొర ప్రమాణాలే పాటిస్తూ.. అడ్డదారుల్లో రేటింగ్‌ పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో CBI రంగంలోకి దిగడం.. పలువురిని అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App