TRINETHRAM NEWS

ప్రవాసాంధ్రులకు 10 లక్షల భీమా

అమరావతి :

విదేశాల్లో ఉంటున్న ప్రవాస ఆంధ్ర ఉద్యోగులు, విద్యార్థులు, వలస కార్మికులకు భీమా పధకంతో భరోసా కల్పిస్తూ కొత్త పథకం తీసుకొచ్చినట్టు APNRTS వెల్లడించింది.

50% సబ్సిడీతో భీమా కల్పించేందుకు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది.

ఈ నెల 26 నుంచి జనవరి 15 లోగా ఈ పథకంలో చేరవచ్చని పేర్కొంది.ప్రమాదంలో మరణించిన, శాస్వుత అంగ వైకల్యం కలిగినా 10 లక్షల రూపాయలు భీమా అందుతుందని తెలిపారు.