TRINETHRAM NEWS

తేదీ: 13-03-2024
Trinethram News : స్థలం చిత్తూరు వివరాలు :
చిత్తూరు పట్టణంలో గంజాయి అక్రమంగా అమ్మకం మరియు రవాణా చేస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచి, వారిని పట్టుకొనుటకు గాను చిత్తూరు జిల్లా ఎస్.పి. రాజ శ్రీ P. జాషువా IPS, గారి ఆదేశాల మేరకు చిత్తూరు, సబ్-డివిజినల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ M. రాజగోపాల్ రెడ్డి గారి మరియు
చిత్తూరు జిల్లా స్పెషల్ బ్రాంచి DSP శ్రీ N. సుధాకర్ రెడ్డి వారి పర్యవేక్షణలో చిత్తూరు ॥ టౌన్ పోలీస్ స్టేషన్, ఇన్స్పెక్టర్ K. ఉలసయ్య మరియు సిబ్బంది కలసి చిత్తూరు పట్టణంలోని తిరుపతి-బెంగళూరు పాత. బైపాస్ రోడ్డు నందు కాణిపాకం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ AP 39 TP 3648 నెంబర్ గల ప్యాసింజర్ ఆటో నడుపుతుండిన డ్రైవర్ G. రవి కుమార్ @ ఆటో రవి అను అతనిని పట్టుకొని, అతని వద్ద నుండి సుమారు 80,000/- రూ.ల విలువ చేసే 02 KG ల గంజాయి ని మరియు గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన ప్యాసింజర్ ఆటోని స్వాధీనం చేసుకోవడం జరిగినది. సదరు G. రవి కుమార్ @ ఆటో రవి చెప్పిన నేర ఒప్పుకోలు మేరకు ఇతను చిత్తూరు || టౌన్ పోలీస్ స్టేషన్ Cr. No.48/2024, U/sec. 20(b) (ii) (c) NDPS Act కేసులో పరారీలో ఉన్న A-3 ముద్దాయి గా తెలిసినది. ఇతను మరియు చిత్తూరు
టౌన్, సంతపేట, సుబాష్ చంద్రబోస్ వీధిలో ఉంటున్న రవితేజ కలసి చాలా కాలంగా చిత్తూరు టౌన్, తేనెబండ రోడ్డులో ఉంటున్న అరవింద్ @ అప్పు అను అతను వైజాగ్ ఏజెన్సీ ఏరియా నుంచి గంజాయి ని అక్రమంగా కొనుగోలు చేసి, వాటిని చిత్తూరుకి అక్రమ రవాణా చేసి, తెచ్చి ఇవ్వగా, వీరు సదరు గంజాయిని చిత్తూరు పట్టణంలో ప్రజలకు ఎక్కువ రేట్లకు అమ్ముతూ, ‘డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిసినది. అరెస్టు కాబడిన ముద్దాయిలను కోర్ట్ ఎదుట హాజరు పరచడం జరుగుతుంది.

అరెస్టు కాబడిన వ్యక్తి యొక్క వివరములు:
1). G. రవి కుమార్ @ ఆటో రవి, వయస్సు 31 సం.లు, S/O లేట్ గణేశ్, D.No.6-640/1, వన్నియర్ స్ట్రీట్, సంతపేట, చిత్తూరు టౌన్..

-పై కనిన ముద్దాయిని పట్టుకోవడంలో విశేషమైన ప్రతిభ కనపరచిన చిత్తూరు ॥ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ C. బాబు, కానిస్టేబుళ్లు హరిప్రసాద్, తవరాజ్, మధు మరియు గోవిందరావు లను అభినందించి, ఇకపై చిత్తూరు పట్టణంలో గంజాయి అమ్మకాలు మరియు అక్రమ రవాణా పూర్తిగా నిర్మూలించాలని ఆదేశాలు జారీ చేయడమైనది.