TRINETHRAM NEWS

డిసెంబర్ నాటికి జిల్లా పరిషత్ గ్రాంట్స్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*జిల్లా పరిషత్ గ్రాంట్స్ పై రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, అక్టోబర్ -22: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

డిసెంబర్ నాటికి జిల్లా పరిషత్ గ్రాంట్స్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా పరిషత్ గ్రాంట్స్ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, జిల్లా పరిషత్ గ్రాంట్స్ లో మంజూరై పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులు, ఇంకా ప్రారంభం కానీ అభివృద్ధి పనులను వెంటనే గ్రౌండ్ చేస్తూ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

గ్రాంట్స్ లో మంజూరు చేసిన పనులలో ఏదైనా అనవసరపు పనులు ఉంటే మండల స్థాయిలో సమావేశం నిర్వహించి ఆ పనిని మాడిఫై చేసుకోవాలని, డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని అందు బాటులోని నిధులను ఎక్కడ వృధా కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడీఓలు , ఈఈ పంచాయతీ రాజ్ గిరీష్ బాబు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App