వై ఎస్ ఆర్ సి పి ని మరింత బలోపేతం చేయాలి
అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
పార్టీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులను అభినందించిన డాక్టర్ సత్తిసూర్యనారాయణ రెడ్డి మరియు పలువురు పార్టీ నాయకులు
Trinethram News : అనపర్తి: ఇటీవల తూర్పుగోదావరి జిల్లా వై ఎస్ ఆర్ సిపి వివిధ విభాగంల జిల్లా అధ్యక్షులుగా నియమించబడిన వారిలో అనపర్తి నియోజకవర్గం చెందిన పంచాయతీ విభాగం జిల్లా అధ్యక్షులు పాలాటి నాగేశ్వరరావు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు వల్లభ శెట్టి రామ సతీష్, వీవర్స్ విభాగం జిల్లా అధ్యక్షులు పెనుగొండ శ్రీనివాసరావు కల్చలర్ విభాగం జిల్లా అధ్యక్షులు కూసుమంచి కృష్ణంరాజు లను మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వీరిని అభినందించారు. నూతనంగా వివిధ విభాగాల జిల్లా అధ్యక్షులుగా నిర్మించబడిన వీరిని దుస్సాలువ ల పూలమాలతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకం ఉంచి మీ అందరికీ పార్టీ పదవులు ఇస్తున్నారని అందరూ కూడా కలిసికట్టుగా పార్టీ ప్రతిష్ట కోసం మరింత కృషిచేసి, ప్రతి విభాగం అధ్యక్షులు ఆయా విభాగాలలో సమర్థవంతంగా పనిచేసి పార్టీ విజయం కోసం పనిచేయాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజిడైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి అనపర్తి జడ్పిటిసి సత్తి గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి, రంగంపేట జడ్పిటిసి పేపకాయల రాంబాబు, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ అడబాల వెంకటేశ్వరరావు రాష్ట్ర కమిటీ సభ్యులు కొల్లాటి ఇజ్రాయిల్ రంగంపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రెమ్మలపూడి శ్రీదేవి వెంకటేశ్వరరావు మర్రిపూడి సర్పంచ్ వేము చిరంజీవి, పార్టీ నాయకులు గొల్లపల్లి రవికుమార్, బత్తిన రాంబాబు, కంటిపూడి నాగేశ్వరరావు, అడబాల కొండయ్య, కే సత్యనారాయణ, కర్రి బాబులు, కొండేటి భీమేష్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App