
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్-4 పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చిక్కడపల్లి పీఎస్ పరిధిలోని జవహర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్లో ఉంటున్న శిరీష (24) ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా ముప్పారం గ్రామంగా గుర్తించారు…..
