TRINETHRAM NEWS

గుండెపోటుతో యంగ్ హీరో మృతి!

Trinethram News : ప్రముఖ భోజ్‌పురి నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు సుదీప్ పాండే గుండెపోటుతో కన్నుమూ శారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్‌లో ఉండగానే అతను గుండెపోటుతో కుప్పకూలాడు. సుదీప్ కేవలం నటుడే కాదు. అభిరుచిగల నిర్మాత కూడా. రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.

అలాంటిది చిన్న వయసు లోనే అతను గుండెపోటు తో కన్నుమూయడం అందరినీ కలచివేస్తోంది. సుదీప్ మరణ వార్తతో అతని కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రలో మునిగిపోయారు. జనవరి 5న సుదీప్ పాండే, పుట్టిన రోజు జరుపుకున్నారు. అభిమానులు అతనికి పుట్టిన శుభాకాంక్షలు తెలిపారు.

బర్త్ డే సెలబ్రేషన్ ముగిం చుకుని తన తదుపరి సినిమా షూటింగ్ కోసం ముంబై వచ్చాడు. ఎప్పటి లాగే బుధవారం సాయంత్రం ఓ సినిమా షూటింగు లోకు సుదీప్ పాండే హాజరయ్యారు.

అయితే ఉన్నట్లుండి అతను గుండెపోటుతో కుప్పకూలాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది భోజ్‌పురి సినీ పరిశ్రమలో సందీప్ పాండే,యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపు ఉంది. నటనతో పాటు నిర్మాణంలో కూడా పాలుపంచుకున్నాడు.

సుదీప్ మరణ వార్త విషయాన్నిఅతని సన్నిహితులు సోషల్ మీడియాలో ధృవీకరించా రు.సుదీప్ పాండే 2007లో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ‘భోజ్‌పురి భయ్యా’ అతని మొదటి సినిమా. తక్కువ కాలం లోనే యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఖూనీ దంగల్’, ‘మసీహా బాబు’, ‘హమర్ సంగీ బజరంగీ బాలి’, ‘హమర్ లాల్కర్’, ‘షరాబీ’, ‘ఖుర్బా నీ’ వంటి సినిమాల్లో సుదీప్ నటించాడు.

సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ఎన్సీపీ పార్టీ లో క్రియాశీలకంగా వ్యవహరి స్తున్నాడు యంగ్ హీరో. సినిమాల్లోకి రాకముందు అతను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేశాడు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App