Working for Mining University
పట్టభద్రుల కు అండగా ఉండేందుకు రాజకీయాల్లోకి..
నిరుద్యోగ సమస్యలపై పోరాడుతా..
ఆశీర్వదించండి అండగా ఉంటా..
ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డా వి. నరేందర్ రెడ్డి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనిలో మైనింగ్ యూనివర్సిటీ కోసం కృషి చేస్తానని కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి వెల్లడించారు… శుక్రవారం గోదావరిఖనిలో పలు ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలలతో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమైనారు.. సభ్యత్వ నమోదు పై అవగాహన కల్పించి రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు ప్రకటించాలని కోరారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పారిశ్రామిక ప్రాంతంలోని సింగరేణి న్టీపీసీ ఆర్ ఎఫ్ సి ఎల్ లో స్థానిక యువతకు ప్రత్యేక రిజర్వేషన్ కోసం పోరాడుతనని ఇక్కడి ఉద్యోగాల్లో 80% ఉద్యోగాలు స్థానిక యువతకు ఇప్పిచ్చే విధంగా ప్రయత్ని వెల్లడించారు..సింగరేణి ఎన్టీపీసీ ఆధారిత పరిశ్రమలను ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా చేస్తాన్నారు.పోటీ పరీక్షలకు గ్రూప్స్ నుండి సివిల్స్ స్థాయి వరకు ప్రిపేర్ అయ్యే విధంగా సెంట్రల్ లైబ్రరీ నిర్మించే విధంగా ప్రయత్నం చేస్తాన్నారు.. తాను 34 సంవత్సరాలు తాను విద్యారంగంలో విశిష్ట సేవలు అందించడం తో పాటు విద్యార్థులకు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందించడం జరిగిందని అన్నారు..
విద్యారంగ సమస్యలపై తనకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందని.. ఉద్యోగులు నిరుద్యోగులు పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని… రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే ఉద్యోగుల నిరుద్యోగుల పట్టభద్రుల సమస్యలపై కృషి చేస్తానని వెల్లడించారు.. ప్రజాసేవ చేయడానికి తను మంచి ఆలోచన తో రాజకీయాల్లోకి వస్తున్నట్టు వెల్లడించారు..తనకు ఒకసారి అవకాశంకల్పించి ఆధారిస్తే విద్యారంగ సమస్యలపై మండలిలో గలమేత్తుతనని పునరుద్ఘాటించారు…. పట్టభద్రుల ఓట్లతో గెలిచిన రాజకీయ నాయకులు వారి సమస్యలు గాలికి వదిలేసారని వారిని పట్టించుకోవడంలేదని. ఆవేదన వ్యక్తం చేశారు..
తెలంగాణలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని నిరుద్యోగులంతా నిరాశ నిస్పహలతో ఇబ్బందులు వేరుకుంటున్నారని.. డిగ్రీలు, పీజీ లు బీఈడీలు PHD లు చేసిన ఉద్యోగాలు రావడంలేదని 1998 డిఎస్సి వాళ్ళు కూడా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని వారి కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయిస్తానని అన్నారు.. తాను ఎమ్మెల్సీగా గెలిస్తే హెల్త్ కార్డుల మంజూరు కోసం కృషి చేస్తానని అన్నారు ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలల యజమానులు 3సంవత్సరాలనుండి స్కాలర్షిప్ బకాయలు విడుదల కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాను రాను పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఓట్ల పై నమ్మకం రావడం లేదని అన్నారు ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App