TRINETHRAM NEWS

పోరాటాలతోటే కార్మికుల సమస్యలు పరిష్కారం
సిఐటియు జిల్లా కార్యదర్శి

ఎరవెల్లి ముత్యంరావు
సిఐటియు జిల్లా విస్తృత సమావేశం

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలోని శ్రామిక భవన్లో కామ్రేడ్ వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించారని ఆన్నారు, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన వంద పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఊసే లేదని సింగరేణి ఎన్టీపీసీ ఆర్ ఎఫ్ సి ఎల్ బసంత్ నగర్ రైస్ మిల్స్ తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాల పెంపుదలకు సంబంధించిన జీవోల సవరణ అంశాన్ని విస్మరించారని, జిల్లా కేంద్రంలో డీసీఎల్ అధికారి నియామకం సింగరేణి సొంతింటి పథకం, హమాలి, ఆటో తదితర రంగాలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, మున్సిపల్,గ్రామపంచాయతీ, అంగన్వాడి,ఆశా తదితర రంగాల కార్మికుల వేతనాల పెంపు కాంతి ఏ ఒక్క అంశం కూడా ప్రస్తావించకపోవడం ఈ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరికి నిదర్శనమని అన్నారు, ఎన్నికల ముందు వివిధ రంగాల కార్మికులకు తాము అధికారంలోకి వస్తే వేతనాల పెంపుతో పాటు అనేక సా సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది, గత సంవత్సరకాలం గా వివిధ రంగాల ప్రగతి నివేదికల పేరుతో ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి,మంత్రులు, కార్మికులకు ఏమి చేశారో ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది, ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఇప్పటివరకు ఎదురు చూశామని, ఇకనుండి ఈ ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కరించాలని పోరాట పంతాను సిఐటియు ఎంచుకుంటుందని, అందుకు కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని, పోరాటాలు తప్ప కార్మికుల సమస్యల పరిష్కారానికి వేరే మార్గం లేదని మరోసారి రుజువైందని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, ఉపాధ్యక్షులు ఎన్, బిక్షపతి, మెండే శ్రీనివాస్,డి,కొమరయ్య,జి,జ్యోతి, ఏం, రామాచారి, ఎస్, రవీందర్, నాయకులు బి,గణేష్, వి,నాగమణి, ఎన్,శంకర్, జి, లక్ష్మారెడ్డి,ఎన్, నరసయ్య, మామిడాల శ్రీహరి, ఈదా వెంకటేశ్వర్లు, యాకూబ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App