TRINETHRAM NEWS

ఇళ్ల స్థలాలు పంపిణీ ప్రక్రియ జాప్యం ఎందుకు?

సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు… 4 నుండి సచివాలయలకు వినతులు… నేడు సీపీఐ రాష్ట్ర నేత అక్కినేని వనజ రాక

Trinethram News : రాజమండ్రి,పిబ్రవరి 03: గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ కు కేబనెట్ ఆమోదం తెలిపిందని కానీ స్థలాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాలేదని వెంటనే ప్రభించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ),ఏలూరు 18 వ డివిజన్ నందు చెంచు కాలనీ లో పేద ప్రజలకు ఇంటి స్థలాలను పెంచి ఇవ్వాలని 5 వ రోజు అర్జీల నమోదు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాటిపాక మధు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పేదవాళ్లకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పేదలు పట్టణ ప్రాంతంలో సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తూ తీవ్ర వ్యవస్థలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం ఇప్పటికే అధిక ధరల భారాలతో ఇబ్బంది పడుతున్న పేదలు ఇంటి అద్దెలు చెల్లించలేక దుర్భర జీవితం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారం చేపట్టి ఎన్నికలు ఎనిమిది నెలలు గడుస్తున్న పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆ దిశగా గత ప్రభుత్వం మంజూరు చేసిన పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమిని రెండు సెంట్లుగా మార్పు చేసి పట్టాలు జారీచేసి వారికి ఇళ్ల స్థలాలు అందజేయాలని, అలానే ఇంటి నిర్మాణానికి రూ 5లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల హామీ అమలు అయ్యేవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. 4 నుండి 10 వరకు ఆయా సచివాలయం పరిధిలో దరఖాస్తులు అందగజేస్తామని అన్నారు

ఈ కార్యక్రమంలో సీపీఐ టౌన్ కమిటీ సభ్యులు టి నాగేశ్వరరావు, పి లావణ్య, కొండవతి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CPI