Trinethram News : Mar 29, 2024,
గుడ్‌ఫ్రైడే రోజు చేపలే ఎందుకు తింటారు?
క్రైస్తవులు దేవుడిగా ఆరాధించే ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజే గుడ్‌ఫ్రైడేగా చెబుతుంటారు. అయితే ఈ రోజున క్రైస్తవులు చేపలు తినడం అనవాయితీగా వస్తోంది. పురాతన కాలంలో చేపలు తీరప్రాంత ప్రజలకు ప్రధాన ఆహారంగా ఉండేవి. క్రైస్తవ మతం యూరోప్ అంతటా వ్యాపించడంతో తీరప్రాంతాల్లో ఉండే వారికి చేపల వినియోగం ఖచ్చితంగా మారింది. ఇతర మాంసాలను తినడం వల్ల పర్యావరణ క్షీణత ఎక్కువవుతుందని చేపలు తినడం అలవాటుగా మారింది.