
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్:భూస్వాములు, దొరల అరాచకాల నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు విరోచితమైన పోరాటం చేసిన వీరుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దొడ్డి కొమరయ్య జయంతిని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సుధీర్, డిబిసిడిఓ ఉపేందర్,డీఎస్సీడిఓ మల్లేశం, డిటిడబ్ల్యుఓ కమలాకర్ రెడ్డి లతో కలిసి అదనపు కలెక్టర్ రెవెన్యూలింగ్యా నాయక్ జ్యోతి ప్రజ్వలన గావించి దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ మాట్లాడుతూ. దొడ్డి కొమరయ్య సాధారణ గొర్రెల పెంపకం దారుల కుటుంబంలో జన్మించినప్పటికీ దొరల, భూస్వాముల అరాచకాలను తట్టుకోలేక యువతి, యువకులను ఏకం చేసి వారి ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. వెట్టిచాకిరి, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టుకొని విసునూరు దొరల ఆగడాలను అరికట్టించడంలో ముందు వరసలో ఉండి పోరాటం చేసిన వీరుడు దొడ్డి కొమరయ్య అని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
