TRINETHRAM NEWS

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుమంటే అక్రమంగా అరెస్టులు చేస్తారా? ఇదేనా ప్రజాపాలన?

__Y.యాకయ్య, వేల్పుల కుమారస్వామి.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నెలకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లంచాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చలో ఇందిరా పార్క్, హైదరాబాద్ కు పిలుపివ్వడం జరిగింది.
ఈసందర్భంగా గోదావరిఖనిలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, రామగుండం మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు వై.యాకయ్య లతోపాటు జిల్లాలో ఉన్న పెద్దపల్లి,మంథని, సుల్తానాబాద్ మున్సిపల్ లలో కార్మికులను, సీఐటీయూ,నాయకులను హైదరాబాద్ కు వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అర్థ రాత్రి నుండి నాయకుల ఇండ్లలోకి, కార్మికుల పని స్థలాల్లోకి పోలీసులు వెళ్లి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సీఐటీయూ రామగుండం మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు వై.యాకయ్య, జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి లు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేయడం తప్పా? అని ప్రశ్నించారు. ప్రజా పాలనలో హక్కులు అడగకూడదా? అని అన్నారు. ప్రజా పాలన అంటే ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్టులు చేయడమేనా? అన్నారు.
గత బి.ఆర్.ఎస్. ప్రభుత్వం కార్మికులపై, నాయకులపై ఈ విధమైన అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ప్రయోగిస్తే ఏం జరిగిందో కాంగ్రెస్ పార్టీ బాగా తెలుసు, అయినప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధానాలను అనుసరిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏరి కోరి తెచ్చుకుంటుందని అన్నారు.
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను నిలువరించాలనుకోడం మూర్ఖత్వం అని అన్నారు. అరెస్టులు అయిన కార్మికులను, సీఐటీయూ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App