
భారతరత్న అవార్డుకు మొత్తం ఖర్చు ఎంతంటే..?
భారత దేశంలో అత్యున్నత మైన అవార్డ్ భారత రత్న. కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ, క్రీడల రంగాలలో అసాధారణమైన కృషి చేసిన వ్యక్తులకు భారతరత్న అవార్డు దక్కుతుంది. దీనిని 1954లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు.
ఈ పతకానికి ఒకవైపు మెరుస్తున్న ప్లాటినం సూర్యుడు, వెనుకవైపు అశోక స్తంభం ఉంటుంది. భారతరత్న పతకం దాని పెట్టెతో సహా మొత్తం ఖరీదు రూ.2,57,732.
భారత రత్న అవార్డును మొదటిసారిగా చక్రవర్తుల రాజగోపాలాచారి పొందారు.
