కలెక్టర్ నీ సైతం వదలని సైబర్ కెటుగలు. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి
(కలెక్టర్ పేరుతో ఫేక్ అకౌంట్)
అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్. జనవరి 23.
అల్లూరిజిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ పేరుతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన మోసగాళ్లు ఒక ఫేక్ ఖాతాను సృష్టించినట్లు జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ తెలిపారు. +9779748339144 నంబర్‌తో సృష్టించిన ఖాతా పూర్తిగా మోసపూరితమైనదని, ఆ నంబర్ ద్వారా డబ్బులు అడగటం,లాంటి మోసపూరక చర్యలు జరుగుతున్నాయని, ఎవరికి ఎటువంటి నగదు బదిలీ చేయరాదని కలెక్టర్ సూచించారు.అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆ నెంబర్‌కు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App