TRINETHRAM NEWS

ప్రతి పది మంది సెల్ ఫోన్స్ యూజర్లలో తొమ్మిది మంది సెల్స్ లో పే టి ఎం…మరి ఆర్బీఐ చర్యలు..ఎలా ఉండబోతుంది..?31కోట్ల ఖాతా యూజర్లు లో.. 4కోట్ల మంది వే నిజమైన ఆధారాలు..? ఇకపై ‘పేటీఎం’ కథ కంచికేనా!..?..ఫిబ్రవరి 29తరువాత ఏమి జరుగుతోంది… యూజర్లు అంతా ఉత్కంఠ?

హోటల్ కు వెళ్తే పేటీఎం. షాపింగ్ కు వెళ్తే పేటీఎం.
ఆఖరికి కూరగాయల మార్కెట్ కు వెళితే పేటీఎం.

చివరకు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా.. పేటీఎం.

2016లో ఎప్పుడైతే పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిందో..

అప్పటి నుంచి దీని దశ తిరిగింది. అందరి నోళ్లలో నానింది. అందరి మొబైల్స్ లో చేరింది. క్రమంగా ట్రాన్జాక్షన్స్ పెరిగాయి. కానీ ఏం లాభం.. పెరుగుట విరుగుట కొరకే అన్న పాత మాటను నిజం చేసిందా అని.. దీని కథ విన్న ఎవరికైనా అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి పెద్ద సంస్థకు ఈ పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించరు.

2021లో ఆర్బీఐ హెచ్చరించినప్పుడే జాగ్రత్త పడుంటే సీన్ ఇక్కడి వరకు వచ్చేది కాదు. మరిప్పుడు పరిస్థితి చేయిదాటిపోయిందా?

ఇంతకీ ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం పనిచేస్తుందా? లేదా?

పేటీఎం పరిస్థితి ఏమిటి? దేశంలో ఏ ఇద్దరు కామన్ మ్యాన్ కలుసుకున్నా ఒకరినొకరు అడిగే ప్రశ్న ఇదే. వారికి పేటీఎం మనీ ల్యాండరింగ్, కేవైసీ ఉల్లంఘన, పేటీఎం వ్యాలెట్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ మధ్య నడిచిన అక్రమ లావాదేవీలు.. ఇవేవీ తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా.. ఏదైనా కొంటే పేటీఎం ద్వారా చెల్లించడమే. దానికోసం అది ఫిబ్రవరి 29 తరువాత పనిచేస్తుందా లేదా అన్నదే కావాలి. కానీ ఇదిప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నే అయ్యింది. ఎందుకంటే పేటీఎం భవిష్యత్తు.. ఆర్బీఐ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఇంతకీ పేటీఎంకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటి? దీనికి బాధ్యులెవరు? ఈ సవాల్ ను పేటీఎం ఎలా స్వీకరిస్తుంది? మళ్లీ పూర్వవైభవాన్ని తెచ్చుకోగలుగుతుందా?

మీరు పేటీఎం వినియోగదారులు అయితే.. దాని ద్వారా ఎలాంటి లావాదేవీలైనా ఫిబ్రవరి 29 వరకే చేయగలరు. ఆ తరువాత క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం, ఫాస్టాగ్ లు చెల్లించడం, డిపాజిట్లు, టాప్‌అప్‌లు చేయడం.. ఇలాంటివేవీ చేయలేరు. ఎందుకంటే ఈ తరహా ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఆపేయమని ఆర్బీఐ ఆర్డర్ జారీచేసింది. బయటి ఆడిటర్లు.. సంస్థ పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఫిబ్రవరి 29 తరువాత ఏం జరగనుంది? సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ పైనే దీని భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పచ్చు. అందుకే ఆ తేదీపై అందరికీ ఆసక్తి నెలకొంది.

సంస్థ అయినా తమ వినియోగదారుల నుంచి కచ్చితంగా కేవైసీని తీసుకుంటుంది. కానీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మాత్రం 35 కోట్ల ఈ-వ్యాలెట్లను కలిగి ఉన్నా.. అందులో 31 కోట్ల ఖాతాలు దిక్కూదివాణం లేకుండా ఉన్నాయి. అంటే ఇప్పుడు పనిచేస్తున్నవి కేవలం 4 కోట్ల ఖాతాలు మాత్రమే. అవి కూడా కొద్ది పాటి బ్యాలెన్స్ తో ఉన్నాయి. దీంతో కేవైసీల్లో ఏం జరిగిందో అర్థమైంది. ఒక్కో పాన్ నెంబర్ పై కొన్ని వేల ఖాతాలు ఉన్నాయని తేలింది. పైగా అకౌంట్ లో ఉన్న లిమిట్ కు మించి ట్రాన్జాక్షన్స్ జరిగాయి. అందుకే మొత్తం వ్యవహారాన్ని తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగినా ఆశ్చర్యపోనక్కరలేదు.

పేటీఎం మాతృసంస్థ పేరు వన్97 కమ్యూనికేషన్స్. కేవలం రెండు రోజుల్లో ఈ కంపెనీ షేరు.. 40 శాతం విలువను కోల్పోయింది. ఓవరాల్ గా చూస్తే.. ఈ షేరు విలువ 77 శాతం పడిపోయింది. దీని దెబ్బకు ఈ సంస్థ మార్కెట్ రేంజ్.. దాదాపు 30 వేల కోట్లకు దిగిపోయింది. 2001లో 2,150 రూపాయిల ఇష్యూ ప్రైస్ తో 18 వేల 300 కోట్లను తెచ్చుకోగలిగింది పేటీఎం. అయినా పేటీఎమ్ కు ఈ కష్టం ఇప్పుడే రాలేదు. 2021లోనే ఆర్బీఐ దీనిని హెచ్చరించింది. ఈ సంస్థ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని అప్పుడే చెప్పింది. కేవైసీల విషయంతోపాటు మనీల్యాండరింగ్ గురించీ వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా బ్యాంకులు ఇచ్చిన కంప్లయింట్లతో వెలుగుచూసింది. ఈ సంస్థ డిపాజిటర్లు, కస్టమర్లు, వ్యాలెట్ ఉపయోగించేవారు అందరూ ఇబ్బందుల్లో పడే ఛాన్సుందని నిపుణులు అంటున్నారు. మరిప్పటి పొజిషన్ ఎలా ఉందో వేరే చెప్పక్కరలేదు. సో, ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం కథ కంచికా కాదా అన్నది తేలిపోతుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ.