TRINETHRAM NEWS

What does Mehbooba Mufti say about PDP’s alliance with BJP?

Trinethram News : శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు అవకాశాలు, ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటులో తమ పార్టీ కీలకపాత్రపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ పై ఘాటు విమర్శలు గుప్పించారు.

జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అవకాశాలను మెహబూబూ ముఫ్తీ తోసిపుచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ పార్టీకి కూడా తమ పార్టీని కలుపుకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యమని అన్నారు. కేవలం ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంతోనే నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికలకు వెళ్తోందని విమర్శించారు. ”వాళ్లు (ఎన్‌సీ) 1947 నుంచి ఇదే చేస్తున్నారు. అంతకు మించి లక్ష్యమేదీ వారికి లేదు. కేవలం ప్రభుత్వం ఏర్పాటు, మంత్రి పదవుల కోసమే వారు పొత్తు పెట్టుకున్నారు” అని పీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మెహబూబా ముఫ్తీ అన్నారు.

పీడీపీ ఒక నిర్దిష్ట ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్తోందని, పీడీపీని కలుపుకోకుండా ఏ పార్టీ కూడా ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని మెహబూబు ముఫ్తీ పేర్కొన్నారు. 2002లో కేవలం 16 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయమని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పాటు కంటే పార్టీ ఎజెండా అమలు చేయడానికే తాము ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. 2015లో బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఈసారి ఎన్నికల తర్వాత కమలం పార్టీతో పొత్తు అవకాశాలు లేవన్నారు.

కశ్మీర్ అంశం రిజల్యూషన్ కోసం బీజేపీతో అప్పట్లో చేతులు కలిపామని, ఆ దిశగా బీజేపీ చేసిందేమీ లేనందున ఈసారి ఆ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీతో పీడీపీ ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదని, బహుశా ఎలాంటి చర్చలు ఉండకపోవచ్చని అన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ మూడు విడతల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న జరుగనున్నాయి. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

What does Mehbooba Mufti say about PDP's alliance with BJP?