కబ్జాలను అరికట్టకపోవడానికి కారణము ఏమిటి.
జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేంద్ర రెడ్డి కి వినతిపత్రం లో సీపీఐ ప్రశ్న.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రెవెన్యూ పరిధిలో కబ్జాదారులు బాహాటంగా విచ్చలవిడిగా వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తున్నారని పత్రికలు, ప్రతిపక్షాలు అధికారులకు వందలాది వినతిపత్రాలు సమర్పిస్తే కట్టడాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారని సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి బృందం నేడు మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కలిసి వినతిపత్రం సమర్పించి అడగడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలోను అన్ని మండలాల్లో వందలాది ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతున్నదని, స్వయంగా మునిసిపల్ చీఫ్ సెక్రెటరీ గారు అక్రమాలను గుర్తించి కూల్చివేయ్యమంటే అధికారులు ఎందుకు కూల్చట్లేదని ప్రశ్నించారు. అదే విధంగా గాజులరామరంలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సర్వే నెంబర్ 326,307 సంబందించి దేవేందర్ నగర్, మిథిలా నగర్,బాలయ్య బస్తి, రావినారాయన రెడ్డి నగర్ మొత్తం అన్యాక్రాంతం అయ్యిందని,సర్వే నెంబర్ 12 లో అప్పటి కలెక్టర్ ఎం వి రెడ్డి గారు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటితే కబ్జా చేసారని,సురారం లో విశ్వకర్మ కాలనీ భూములు కబ్జా గురవుతున్నాయని అన్నారు,జగతగిరిగుట్ట లో 348/1 లో దేవాదాయ భూమి, రాజీవ్ గృహకల్ప,భూములు కబ్జాకు గురవుతున్నాయని వెంటనే అక్రమ కట్టడాలను కూల్చివేయ్యాలని కోరారు. బాచుపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు ఎదెచ్చగా కబ్జా చేస్తుంటే కాపాడవలసిన రెవెన్యు అధికారులు చూస్తున్నారు. తప్ప చర్యలు తీసుకోవడం లేదు అని అన్నాను. నిజాంపేట్లోని మధుర నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద గతంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వున్న గోపి వెజిటేబుల్ మార్కెట్ కోసం కేటాయించిన స్థలని ఇప్పుడు కొంత మంది కబ్జాదారులు కబ్జా చేస్తున్నారు. ఇలా మండల పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ వద్ద సర్వే నెంబర్.344,నిజాంపేట్ సర్వే నెంబర్.87 లో ఇలా అనేక చోట కబ్జాలకు గురి అయుతున్న అదికరులు పట్టించుకోడం లేదు. కబ్జాదారులు ప్రభుత్వ భూమి లోనీ సర్వే నెంబర్.90లో సర్వే నెంబర్.94 ప్రవేటు భూమి పత్రాలతో కబ్జాలు చేస్తున్నారు అని గుర్తుచేశారు. అలాగే ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్ లేకుండా షెడ్లు వేస్తున్న నిజాంపేట్ రాజీవ్ గృహకల్పలో బస్ స్టాప్ ను కబ్జా చేసి పర్మిషన్ లేకుండా బహుళ అంతస్తుల కడుతున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కనీసం అటు వైపు కన్నెత్తి చూడలేదు లేదు అని అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామ కృష్ణ రావు ను కలిసి ఈ విషయం పై మాట్లాడానికి ఎన్ని సార్లు ప్రయత్నం చేసిన కనీసం ఒక్క సారి కూడా సమయం ఇవ్వలేదు అని అన్నారు .ఇలానే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ప్రజా దర్బార్ లో ఈ కబ్జాలపై పిర్యాదు చేస్తాము అని హెచ్చరించారు .
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, బాచుపల్లి కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు హరినాథ్ రావు,మండల కోశాధికారి సదానంద, ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్, స్థానిక నాయకులు కె.మహేష్,కె.నాగేశ్వర్ లు పాల్గొన్నారు.