TRINETHRAM NEWS

మంచిర్యాల మార్చి-15// త్రినేత్రం న్యూస్. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ (బెజ్జల ) గ్రామంలో తాండూర్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్ మరియు స్లోమ్యాన్ వారి సహకారంతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం లో భాగంగా “పోలీస్ మీకోసం” కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో త్రీ ఇంక్లైన్, ఫైవ్ ఇంక్లైన్ మరియు నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గూడెం లకు చెందిన 365 కుటుంబాలకి, ఒక్కొక్క కుటుంబం కి 5కిలోల బియ్యం, 5కిలోల గోధుమ పిండి, 2 కిలోల పప్పు ను అందచేశారు
ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ పోలీసులు ప్రజల కోసమే పనిచేస్తున్నారన్నారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల ప్రజలతో పోలీసు అనుసందంగా ఉండడం మరియు వారిని విద్య వైద్య సదుపాయాలు అందే విధంగా చేస్తూ వారు ముందుకు వెళ్లే లాగా అండగా ఉండేలా ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని, గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో సౌకర్యాలు మెరుగుపడ్డాయని తెలిపారు. గిరిజనుల శ్రేయస్సుకు పోలీసులు ఎప్పుడు కృషి చేస్తారన్నారు.

గిరిజనుల అమాయకత్వాన్ని ఆశ్రయ చేసుకుని కొన్ని సంఘవిద్రవశక్తులు ప్రలోభాలకు గురిచేసి చెడు మార్గాల వైపు ప్రోత్సహించేలా చేస్తారని ప్రలోభాలకు లోను కాకుండా మంచిని ఎంచుకొని సమాజ శ్రేయస్సు కృషి చేయాలన్నారు. అనంతరం ఆదివాసి గిరిజనులతో కలిసి సహాపంక్తి భోజనాలు చేశారు గత సంవత్సరంలో ఈ ప్రాంతం వారికీ రాబిన్ ఫుడ్ ఆర్మీ హైదరాబాద్ వారి సహకారంతో 69 కుటుంబాలకి నిత్యవసర వస్తువులను అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, మాదారం ఎస్సై సౌజన్య తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్, కన్నెపల్లి ఎస్సై గంగారం భీమిలి ఎస్సై విజయ్ కుమార్, రాబిన్ వుడ్ ఆర్మీ హైదరాబాద్ సంబంధించిన సభ్యులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

welfare of the tribal