Trinethram News : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి భారత చైతన్య యువజన పార్టీ పని చేస్తుందని ఆ పార్టీ ప్రత్తిపాడు సమన్వయకర్త సంకూరి మహాలక్ష్మి తెలిపారు.
గురువారం లక్ష్మీపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్తిపాడు పరిధిలో తాగునీటి సమస్య నిత్యం వెంటాడుతోందని చెప్పారు.
టీడీపీ, వైసీపీ పరిపాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తాము పని చేస్తామని చెప్పారు.
భారత చైతన్య యువజన పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి
తనవంతు కృషిచేస్తానని ప్రత్తిపాడు
నియోజకవర్గ సమన్వయకర్త మహా
లక్షీ అన్నారు.
మరో 2, 3 రోజుల్లో నియోజకవర్గంలో పర్యటన ప్రారంభించి తమ పార్టీ మ్యానిఫెస్టోని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్తానని చెప్పారు.
నియోజకవర్గంలో నీటి సమస్యతో పాటూ రైతాంగ, విద్యార్థి సమస్యల పరిష్కారాన్ని బాధ్యతగా తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
మాల ఐక్య సేవాసమితి నాయకులు
స్టాలిన్ మాట్లాడుతూ మహాలక్ష్మి గెలుపు కోసం అందర్నీ కలుపుకొని
అహర్నిశలు కృషిచేస్తామని, ఒక మాల బిడ్డ కనుకనే తాను తన మాల ఐక్య సేవ సమితి మద్దతుగా నిలుచున్నామ్ అని స్పష్టం చేశారు.
అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గ పెద్దలను కార్యకర్తలును పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు
ఈ కార్యక్రమం లో మాల మహానాడు అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబు, యర్రకుల భాస్కర్, కారుమూరి నాగ జ్యోతి, ఆదిన సతీష్ తదితరులు పాల్గొన్నారు..