![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-11.11.38-PM.jpeg)
అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి వేగంగా జరుగుతుంది :పీఎం మోదీ
దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాదించడంతో భారతీయ జనతా పార్టీ ప్రధానకార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజెపి అగ్రనేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
దిల్లీ ప్రజలకు ఈరోజు పండుగలాంటిదన్నారు. ఆప్ నుంచి విముక్తి లభించిందన్నారు.
దిల్లీ ప్రజల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని అభివృద్ధి రూపంలోకి తీసుకొస్తామన్నారు.
ఇకపై ఢిల్లీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఢిల్లీలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఈ విజయం కోసం ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడ్డారు. ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను తిరిగి అనేక రెట్లు వారికిస్తాం. ఢిల్లీలో విజయం సాధారణమైన విజయం కాదు-ప్రధాని మోడీ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![PM Modi](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-11.11.38-PM-1024x576.jpeg)