TRINETHRAM NEWS

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట మండలంలో ఈరోజు జరిగిన అభివృద్ధికార్యక్రమాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ●రూ. 52 లక్షలతో ఎన్కతల 33/11 KV సబ్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన అదనపు ట్రాన్స్ ఫార్మర్ప్రారంభోత్సవం.మోమిన్ పేట మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు మంజూరు అయిన 66 కళ్యాణలక్ష్మీ,షాదీముబారక్ మరియు 25 CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చంద్రాయనపల్లి గ్రామంలో అంగన్వాడీ మరియు పూర్వ ప్రాధమిక పాఠశాల పిల్లలకు యూనిఫామ్ దుస్తులపంపిణీమొరంగపల్లి గ్రామంలో 25 లక్షల రూపాయలతోనిర్మించిన నూతన హెల్త్ సబ్ సెంటర్ భవనంప్రారంభోత్సవం.
స్థానికప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈసందర్భంగా మోమిన్ పేటలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూగత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని కూడా తప్పకుండాఅమలవుతాయి.రైతు రుణమాఫీ, రైతు భరోసా లపై డిసెంబర్ 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తారు. అర్హులైన వారందరికీ ఈ రెండు పథకాలు అందుతాయి.కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకుత్వరలోనే తులం బంగారం పంపిణీ కూడా ప్రారంభిస్తాం
గత ప్రభుత్వంలో వెయ్యి, అయిదు వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు కూడా పంట పెట్టుబడి సహాయం అందింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి అర్హులు‌, నిజంగా పంటల పండించే రైతులకే పెట్టుబడి సహాయం అందించాలని క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. నివేదిక రాగానే రైతు భరోసా పంపిణీ చేస్తారు.
వికారాబాద్ ని యోజకవర్గానికి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నాలుచేస్తున్నాను. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలుకలుగుతాయి.కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నివాస గృహాలకు సోలార్ పైలట్ ప్రాజెక్టు ను మోమిన్ పేటమండలంలో అమలు చేస్తాం.
గత పదేళ్ళ నుండి నియోజకవర్గంలో సరైన రోడ్లు వేయలేదు, త్రాగునీరు సరఫరా లేదు.ఇప్పుడు మన ప్రభుత్వ హయంలో కావలసినన్ని నిధులు వస్తున్నాయి. స్పీకర్ హోదాలో ఉండడంతో ముఖ్యమంత్రి నియోజకవర్గంతో సమానంగా మనకు నిధులు మంజూరు అవుతున్నాయి. వికారాబాద్ నియోజకవర్గంలోని R& B రోడ్లు, పంచాయితీ రోడ్లు, పొలాలకు వెళ్ళే రోడ్లకు 260 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. త్వరలోనే అన్ని రోడ్ల పనులను ప్రారంభించి త్వరగా పూర్తి చేయిస్తాను.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App