
We will continue to distribute fruits to schoolgirls in the villages of Mustyala Sundilla in Ramagiri mandal
రామగిరి మండలంలోని ముస్త్యాల సుందిళ్ల గ్రామాల్లోని పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పండ్లు పంపిణీ కొనసాగిస్తామని
రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ముస్త్యాల తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు అన్నారు.
బుధవారం రామగిరి నంబమ్మ కన్నం బొందయ్యల జ్ఞాపకార్థంగా విద్యార్థిని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.
తాను సర్పంచ్ గా ఉన్న సమయంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని దాన్ని అలాగే కొనసాగిస్తామని గత ఐదు సంవత్సరాలుగా విద్యార్థిని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి బుధవారం ఆయా పాఠశాలల్లో సుమారు 400 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ బుధవారం పండ్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. సమాజ సేవ చేసే వాళ్లకు పదవులతో సంబంధం లేదని అన్నారు మరియు ప్రతి బుధవారం విద్యార్థులకు పండ్ల పంపిణీ ఉంటుందని లావణ్య అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
