
Trinethram News : జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహిస్తామని CEC రాజీవ్ కుమార్ వెల్లడించారు. J&Kలో ఎన్నికల సన్నద్ధతపై అధికారులు, పార్టీలతో సమీక్షించిన ఆయన.. ‘పారదర్శకంగా, వివక్ష లేకుండా ఎన్నికలు నిర్వహిస్తాం. అన్ని పార్టీల అభ్యర్థులకు భద్రత ఒకే విధంగా ఉండేలా చూస్తాం. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు వేయవచ్చు. ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనాలి’ అని కోరారు.
