TRINETHRAM NEWS

ఈ యాత్రలో ముఖ్యమంత్రి శ్రీ YS.జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్ , రొంపిచర్ల క్రాస్ , విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు…
అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు అయ్యప్పనగర్ బైపాస్ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు..
సభ అనంతరం కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ళ దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.