Warning to all people of Gudivada One Town area
Trinethram News : ఎన్నికల ఫలితాలు దృష్ట్యా,ఎన్నికల నిబంధనలు ఉల్లంగిస్తే కఠినమైన చర్యలు తప్పవు:: వన్ టౌన్ సి.ఐ కే ఇంద్ర శ్రీనివాస్
- మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి సహకరించిన గుడివాడ పట్టణ ప్రజలందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు..
- సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఉదేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్లు ఆధారాలు లేకుండా కథనాలు రాసిన చట్టపరమైన చర్యలు తీసుకోబడును,వాటికి పూర్తి బాధ్యత ఆ గ్రూప్ అడ్మిన్ తీసుకోవాలన్నారు
ఎన్నికల ఫలితాలు నేపధ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు
చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవు
ఎన్నికల కోడ్ సెక్షన్ 144,పోలీస్ ఆక్ట్ అమలులో ఉన్నందున ముగ్గురుకి మించి ఎక్కువ గుంపుగుడి ఉండరాదు
ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు రాజకీయ నాయకులు,కార్యకర్తలు ప్రత్యర్థులు ఇండ్ల ముందు, కార్యాలయాల ముందు కానీ, బాణాసంచా పేల్చారాదు
సివిల్ తగాదాలు ఆసరాగా తీసుకుని ఒకరిపై ఒక్కరు గొడవలు దిగిన వారి ఇరువురిపై కఠిన చర్యలు తీసుకుంటాం
పెట్రోల్,డీసెల్ వంటి మండే ఫ్యూయల్స్ ని నిల్వలు కూడా నిషిద్ధం, బాటిల్స్ లో పెట్రోల్ సరఫరా నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు
అనుమతులు లేని బహిరంగ సభలు,సమావేశాలు,బైక్ ర్యాలీ నిర్వహనాలు శిక్షార్హం
ద్విచక్రవాహనలతో స్టంట్స్ వేస్తూ,వాహనం యొక్క సిలెంసెర్ తొలగించి పెద్ద పెద్ద శబ్దాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకొని,వాహనాలను సీజ్ చేస్తాం
ప్రభుత్వ మద్యం షాపుల వద్ద,బహిరంగగాను మద్యం సేవించడం నేరం
అనుమతులు లేకుండా డి.జే సౌండ్స్ ఏర్పాట్లు చేసి వేరే వర్గాలను ఇబ్బందులకు గురి చేసే అటువంటి సాహిత్యాలు ,పాటలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకొని,సౌండ్స్ సిస్టం స్వాధీనం చేసుకోబడును
గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టే విద్దాంగా వ్యాఖ్యలు చేస్తూ గొడవలు విద్వేషాలకు కారణం అయినటువంటి వారి యొక్క సమాచారం ఎవరైనా ఇస్తే ఆ సమాచారం గౌప్యంగా ఉంచబడును
గుడివాడలో శాంతి భద్రతల ఎలాంటి భంగం వాటిల్లకుండా ప్రజలు తమవంతుగా సహాయ సహకారాలు అందించాలి
గుడివాడ వన్ టౌన్ సి.ఐ కే ఇంద్ర శ్రీనివాస్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App