TRINETHRAM NEWS

కూరగాయల మార్కెట్ లో హమాలీలకు కూలీ రేట్లు పెంచాలి.

మార్కెట్లో హమాలీల ఆందోళన.

హోల్ సేల్ వ్యాపారులు స్పందించాలి.

ఏఐటియుసి హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అద్యక్షులు ఎం.ఎ.గౌస్ డిమాండ్.

గోదావరి ఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని కూరగాయల మార్కెట్ లో పని చేస్తున్న హమాలీలకు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఏఐటియుసి హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అద్యక్షులు ఎం.ఎ గౌస్ పేర్కొన్నారు. గురువారం గోదావరిఖని కూరగాయల మార్కెట్ లో హమాలీ వర్కర్స్ తో కలిసి ఆందోళన కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ గోదావరిఖని కూరగాయల మార్కెట్ లో పని చేస్తున్న హమాలీలకు కూలీ రేట్లు పెంచకుండా హోల్ సేల్ వ్యాపారులు కాలయాపన చేస్తూ, హమాలీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హమాలీ లకు కూలీ రేట్లు పెంచాలని హోల్ సేల్ వ్యాపారులకు, లేబర్ అధికారులకు వినతి పత్రాలు గత కొన్ని నెలల క్రితం ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నో సార్లు వీరికి కూలీ రేట్లు పెంచాలని వ్యాపారులతో మాట్లాడినప్పటికిని నిర్లక్ష్యం ధోరణి ని వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇట్టి కూలీ రేట్ల విషయంలో స్థానిక ఎమ్మెల్యే స్పందించి కూలీ రేట్ల పెంపుదలకు సహాకరించాలని ఆయన కోరారు. హోల్ సేల్ వ్యాపారులు తమ నిర్లక్ష్యాన్ని వీడి హమాలీ లకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు, లేనిచో ఏఐటియుసి ఆద్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కండె లక్ష్మయ్య, గడ్డం రాంచందర్, బండారి రవిందర్, గాలిపెల్లి సతీష్, ఆవుల ఐలయ్య, జాని మియా, గొర్రె రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App