TRINETHRAM NEWS

విశ్వబ్రాహ్మణ మహిళలు అందరికీ ఆదర్శం..!

ఖనిలో మహిళా మణులకు ముగ్గుల పోటీలు..

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వబ్రాహ్మణ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రథమ 2వేల రూపాయలు, ద్వితీయ 1500, తృతీయ బహుమతి వెయ్యి రూపాయలు అందజేశారు. అలాగే పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు అందజేశారు. మహిళలు వేసిన రంగవల్లులు అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి రామగుండం వోపా అధ్యక్షులు నాగుల మల్యాల రాజమౌళి చార్యులు అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి పానుగంటి స్వామితో పాటు ముఖ్య అతిథులు ఆలయ చైర్మన్ మామిడిపల్లి భాస్కర్, ప్రధాన కార్యదర్శి కజాంపురం ప్రభాకర్ చారి, సలహాదారులు ఉపేందర్ హాజరై బహుమతులు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వోపా కోశాధికారి పానుగంటి మారుతి, ఉపాధ్యక్షులు కత్రోజు మోహన్, నాయకులు బసవత్తుల రామయ్య, ఉట్నూరి రాజయ్య, మడుపు రవీంద్ర చారి, మంచోజు స్రవంతి, పూసాల సదానంద చారి, బసవపత్రి వెంకటేశ్వర్లు, మంచోజు బ్రహ్మచారి, న్యాయ నిర్ణీతలుగా మంచోజు స్రవంతి, కాసుల జగదీశ్వరి, కొత్తడ్ల శైలజ, పాంచాల శారద వ్యవహరించగా సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App