నెల్లూరు నగరంలోని నవాబుపేట శివాలయంలో అర్చక బృందం ఏర్పాటు చేసిన కార్తీక వన భోజన మనోత్సవం, అలాగే పల్లిపాడు గాంధీ ఆశ్రమంలో విశ్వబ్రాహ్మణ కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమాలలో నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్తీక వన భోజన కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం గాంధీ ఆశ్రమంలో ఉన్న మహాత్మా గాంధీ, పొణకా కనకమ్మ గార్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్తీకమాసం సందర్భంగా కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఆ పరమేశ్వరుని కృపాకటాక్షాలు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి, నగర ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దామవరపు రాజశేఖర్, పోట్లూరి రామకృష్ణ ఆచారి, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు ఇలపాక శివకుమార్ ఆచారి, ఖజానా శేషయ్య ఆచారి, తదితరులు పాల్గొనారు.
పల్లిపాడు గాంధీ ఆశ్రమంలో విశ్వబ్రాహ్మణ కార్తీక వన భోజన మహోత్సవ
Related Posts
Brutal Murder : ఏపీలో తల్లి, కుమారుడి దారుణ హత్య
TRINETHRAM NEWS ఏపీలో తల్లి, కుమారుడి దారుణ హత్య Nov 23, 2024, Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరంలో దారుణం చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి తల్లి, కుమారుడిని దుండగులు హత్య చేశారు.…
దేశంలో రైల్వేస్టేషన్ లేని ఏకైక రాష్ట్రం సిక్కిం
TRINETHRAM NEWS దేశంలో రైల్వేస్టేషన్ లేని ఏకైక రాష్ట్రం సిక్కిం Trinethram News : దేశంలోని ప్రతీ రాష్ట్రంలో రైల్వే లైన్ ఉంది. సిక్కింలో మాత్రం రైల్వే సౌకర్యం లేదు. అక్కడి ప్రతికూల వాతావరణమే ఇందుకు కారణం. నిటారుగా ఉండే లోయలు,…