పీసా చట్టాన్ని ఉల్లంకిస్తే క్రిమినల్ కేసులు తప్పవు – మొట్టడం రాజుబాబు.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : పీసా చట్టాన్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతాం. ఆదివాసీ జెఏసి,ఆదివాసీ పార్టీ
పీసా చట్టాన్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మరియు భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మొట్టడం రాజబాబు హెచ్చరించారు. పీసా చట్టం గురించి తెలిసిన వారు పీసా కమిటీలో ఉంటే పీసా చట్టం సక్రమంగా అమలౌతుందని ఆదివాసీ సమాజం ఆశా భావం వ్యక్తం చేస్తుంటే,ఆదివాసేతర పార్టీల కబంధ హస్తాలలో చిక్కి ,బానిసత్వం నీడలో ఉన్న కొంతమంది ఆదివాసీలు తమ పార్టీవారు పీసా కమిటీలలో నెగ్గాలని, తెగ తాపత్రయం పడుతున్నట్లు తెలిసిందని,ఏ పార్టీలో ఉన్న,పార్టీలో లేకున్నా,ప్రతి ఆదివాసీ ఆదివాసీ హక్కులు, చట్టాల గురించి తెలుసు కోవాలని చెప్తున్నప్పటికి ఆదివాసేతర పార్టీల మోజులో పడి తెలుసుకోవడంలేదు కానీ, పీసా చట్టం లాంటి ఆదివాసీలకు పవిత్రమైన చట్టంకు కమిటీల ఎంపిక జరుగుతుంటే చట్టాలపై కనీస అవగాహన లేని వారిని పోటీలో పెట్టి, ప్రజలకు ప్రలోభాలకు గురి చేసి కమిటీ ఎన్నికల్లో గెలవాలని కొంతమంది రాజకీయ నాయకులు అనుకొంటున్నారని,అంగ బలం,అర్ధ బలంతో గెలిస్తే గెలవచ్చు, కానీ భవిష్యత్తులో పీసాచట్టం ప్రకారం గ్రామసభ తీర్మానంతోనే ఆయా గ్రామాలలో పనులు జరగాలి తప్పా, కమిటీలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే జైలుకు పోవలసి వస్తుందని,గతంలో ఎవరూ పట్టించుకోలేదు కనుక ఎదో జరిగిపోయింది, ప్రస్తుతం మాత్రం ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి మరియు భారత్ ఆదివాసీ పార్టీ రెండు కళ్లతో చూస్తుంటదని తేడా వస్తే చట్ట ఉల్లంఘన క్రింద క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి నాయకులు పాడి లోవరాజు,శ్యామల వరలక్ష్మి,మాకాడ బూరుగులయ్య, బూరుగుల వెంకట్రావు,రీమెల పాలు, లకే రామచంద్రుడు, కోర్రు బాబురావు,లోత పద్మ శ్రీను, అశోక్ లాల్,వంజరి శంకురమ్మ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App