తేదీ: 02/01/2025.
గ్రామ రెవెన్యూ రైతు సభ.
తిరువూరు నియోజకవర్గం: (త్రినేత్రం న్యూస్): విలేఖరి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, తెల్లదేవరపల్లిలో గ్రామ రైతుసభ జరిగింది. ఈ సభలో రైతులకు సంబంధించిన భూమి యొక్క పాస్ పుస్తకం లో సర్వే నంబర్లు, పేరు మార్పులు, భూమి ఒకరిదైతే ఆన్లైన్లో వారి పేరు ఉండకుండా వేరే వాళ్ల పేర్లు ఉండటం గానీ , గత ప్రభుత్వంలో భూకజ్జాలు కు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరియు భూమి మీద హక్కు ఎవరికీ అయితే ఉందో వాళ్లకు మీ భూమి- మీ హక్కు ద్వారా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని ఉమ్మడి కూటమి నాయకులు, రెవెన్యూ బృందం రైతులకు తెలపడం జరిగింది.
సభకు వచ్చినటువంటి రైతులు ఆర్జీ పత్రాలను తీసుకుని వారి భూమికి సంబంధించిన తగు వివరణ రాచి రెవెన్యూ బృందానికి ఇవ్వగా వెంటనే వాటిని పరిశీలించి శరవేగంగా సమస్యలకు పరిష్కారం చేస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్ది శాశ్వత భూమి హక్కు ఎవరుకలిగి ఉన్నారో రికార్డులు మొత్తం పరిశీలించి ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేస్తామని అన్నారు.
రెవెన్యూ బృందానికి , ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి రైతులు అభినందనలు తెలపడం జరిగింది. వచ్చిన వారికి ఎటువంటి లోటు లేకుండా భోజన సదుపాయం కల్పించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App