TRINETHRAM NEWS

సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
అయోధ్య శ్రీరామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట జరిగి సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా. ఈరోజు వికారాబాద్ ఆర్యవైశ్య భవనంలో వికారాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ పాల్గొని. హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్. లోక కళ్యాణం కోసం, భారతదేశ ప్రజలు, దేశ రైతులు అందరూ పచ్చని పంటలు పండించి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలి దేవుడిని ప్రార్థించారు. అలాగే ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా పారాయణం క్రమం తప్పకుండా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కులాలకు అతీతంగా మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App