TRINETHRAM NEWS

Trinethram News : ఈనెల 12వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా జరుగు అంగన్వాడీల సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు  జిల్లా అధ్యక్షులు సిహెచ్.చంద్రశేఖర్. అంగన్వాడి  వర్కర్స్  అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ, జిల్లా అధ్యక్షురాలు, ఎస్. శ్రీలక్ష్మి అన్నారు.  వారు మాట్లాడుతూ, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ ,కర్షక ,ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని అన్నారు.  కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలను గద్దె దించాల్సిన అవసరం ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తెలంగాణ కంటే అదనంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచుతానని చెప్పారని  అన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరం పూర్తి అవుతున్న ఇంతవరకు వేతనాలు అంగన్వాడీలకు పెంచకపోవడం దుర్మార్గమని అన్నారు. అంగన్వాడీలకు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. గత కొంతకాలం నుంచి అంగన్వాడీలు ఆందోళనలు చేస్తున్న వారికి వేతనాలు పెంచలేదని అన్నారు.

అందుకని ఈ ప్రభుత్వాలు పట్టించుకోనందున అంగన్వాడీలు సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని అన్నారు. అలాగే మున్సిపల్ కార్మికుల పర్మినెంట్ గురించి ఇంకా వారు ఎదుర్కొంటున్న ఇతర సమస్యల గురించి ఈనెల వారు కూడా సమ్మెబాట పెట్టారని అన్నారు. అలాగే ఆశ వర్కర్స్ మధ్యాహ్న భోజన కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం కూడా ఆందోళన జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగివచ్చి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

లేదంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమని అన్నారు.  ఈనెల12వ తేదీ నుండి జరుగు అంగన్వాడిల సమ్మెలో అంగన్వాడీ టీచర్ , ఆయా, మినీ వర్కర్స్,  ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీసు వద్దకు చేరుకొని అంగన్వాడీల సమ్మెలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం దిగివచ్చి పెరిగిన ధరలకు అనుగుణంగా తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచేంతవరకు సమ్మె జరుగుతుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటి అమలు చేయాలని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు. దహనానికి  మట్టి ఖర్చులకు  50.000 ఇవ్వాలన్నారు. విధుల్లో చనిపోయిన వారికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా, చెల్లించాలన్నారు.2017 నుండి పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని అన్నారు.

అదేవిధంగా అనేక నెలల నుండి, టెక్నికల్ ప్రాబ్లం తో, వందలాది మందికి  కొన్ని నెలలుగా జీతాలు చెల్లించలేదన్నారు. ఇంకా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల్ని పరిష్కారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్  హెల్పర్స్ యూనియన్  సిఐటియు అనుబంధం, రైల్వే కోడూరు ప్రాజెక్టు అధ్యక్షురాలు  ఎన్. రమాదేవి, వర్కింగ్ ప్రెసిడెంట్  ఓబులవారిపల్లి మండల  కార్యదర్శి రాధా కుమారి,  కోడూరు మండల  కార్యదర్శి,జి .పద్మ, చిట్వేల్ మండల కార్యదర్శి, వై సుజాత, తదితరులు పాల్గొనడం జరిగింది.