వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు డిసెంబర్ 1వ తారీకు నుంచి 9వ తారీఖు వరకు ప్రజల పాలన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ప్రజా పాలన విజయోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు వికారాబాద్ మున్సిపల్ శాఖ తరపున, చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ట్రాక్టర్లు, శానిటేషన్ ఆటోలతో ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో వికారాబాద్ మున్సిపల్ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం ప్రజా పాలన విజయోత్సవాలను పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలునిర్వహించారు. కళాకారులు తెలంగాణ గీతాలు ఆలపించడం, వివిధ పాఠశాలల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సేవకులను చైర్ పర్సన్ సన్మానించడం జరిగింది. అనంతరం పారిశుద్ధ్య సేవకులకు హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, టీపిఓ వేణు గోపాల్, మేనేజర్ కృపాకర్, మెప్మా రవి, మెప్మా వెంకట్, ఏఈ అనిల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీనివాస్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఏసు, అకౌంటెంట్ వాసవి, బిల్ కలెక్టర్లు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది రామకృష్ణ, జవాన్లు చిన్నయ్య, శ్రీను, ఆశయ్య, శంకర్, వివిధ పాఠశాలల విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App