TRINETHRAM NEWS

నిరుపేద విద్యార్ధికి అండగా VHR ఫౌండేషన్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం నియోజకవర్గం 14వ డివిజన్ పరిధిలోని చైతన్యపురి కాలనీ కి చెందిన తప్పెట్ల సౌజన్య అనే విద్యార్థి తల్లి అయిన తప్పెట్ల కమల అకస్మాత్తుగా అనారోగ్యంతో మరణించారు, అలాగే గత కొంతకాలంగా సౌజన్య తండ్రి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డయాలసిస్ చికిత్సను పొందుతున్నాడు, పీజీ విద్యను పూర్తి చేసిన సౌజన్య న్యాయవాద ప్రవేశ పరీక్ష రాసి ఉస్మానియా యూనివర్సిటీలో సీటు సంపాదించింది, కానీ ఆ విద్యార్థి కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో అనారోగ్యంతో మంచన పడ్డ తండ్రి, పరిస్థితి చూసి, కోలాట కళాబృందంలో ప్రదర్శనలు ఇస్తూ వచ్చిన మొత్తంతో ఎంతో కష్టపడి చదివి లాసెట్ లో మంచి ర్యాంకు సంపాదించింది, సీటు పొందిన కూడా కళాశాలకు వెళ్ళి జాయిన్ అవ్వలేక పోయింది,ఇటీవల తన తల్లి అర్ధాంతరంగా అనారోగ్య రీత్యా మరణించింది , అదేవిదంగా సరిగా నడవ లేని స్థితిలో ఉన్న తమ్ముడు ఇలా కుటుంబంలోని ప్రతి ఒక్కరి పరిస్థితి దయనీయంగా మారింది

ప్రస్తుతం ఆ కుటుంబ పెద్ద అనారోగ్యంతో మంచాన పడడం పోషించే తల్లి అకస్మాత్తుగా అనారోగ్యంతో మరణించడంతో, ఇద్దరు చిన్నారులు అనాధలుగా మిగిలారు, కోలాట కళాబృందం సభ్యులు VHR ఫౌండేషన్ ఫౌండర్ హరీష్ రెడ్డి కి ఆ కుటుంబ పరిస్థితిని వివరించగానే వెంటనే స్పందించి, సౌజన్య తల్లి పెద్దకర్మకు 50 కిలోల బియ్యం తో ఆర్థిక సాయం వెంటనే అందించాలని, అలాగే ఆ చిన్నారి కి భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చిన ముందుండాలని ఫౌండేషన్ సభ్యులకు తెలిపారు, వారి ఆదేశంతో VHR ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి వారికిబియ్యాన్ని,7000రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు

ఈ కార్యక్రమంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు, కోలాట కళాబృందం కళాకారులు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App