TRINETHRAM NEWS

సామాన్యులకు గుండెపోటు తెప్పిస్తున్న కూరగాయల ధరలు!

ప్రస్తుతం హైదరాబాదులో కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు 200 రూపాయలు తీసుకువెళ్తే చాలు.. సంచి నిండా కూరగాయలు వచ్చేవి.

కానీ ఇప్పుడు రెండు రకాల కూరగాయలు కూడా రావడం లేదు. గత వారం వరకు కార్తీక వారాలు కాబట్టి ధరలు భారీగా పడిపోయాయి. అలాగే చికెన్ రేట్లు కూడా తగ్గాయి. దీంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. పంట దిగుబడి కూడా తక్కువగా ఉండటం, పంట సరిగా చేతికి అందకపోవడంతో ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో కూరగాయల ధరలు చూసుకున్నట్లైతే.. బీన్స్- రూ. 50, చిక్కుడు- రూ. 65, దొండకాయలు- 50 రూపాయలు, బెండకాయలు -60 రూపాయలుగా ఉంది. అలాగే మార్కెట్‌లో అతి తక్కువగా పలికే టమాటా ధర కిలో 25 రూపాయలు ధర పలుకుతోంది.

ఇక ఉల్లి, వెల్లుల్లితో పాటుగా అల్లం, ఆకుకూరలు ధరలు కూడా సామాన్యులకు గుండెపోటును తెప్పిస్తున్నాయి. హోల్‌సేల్‌ లో కిలో వెల్లుల్లిపై ధర రూ. 240 ఉంది. పావు కిలో అల్లం రూ. 40 రూపాయలు ఉండగా.. కిలో అల్లం ధర 150 రూపాయలకు పైనే ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట లేకపోవడం, నాణ్యత లేకపోవడం, కొత్త పంట రాకపోవడంతో ధరలు అధికంగా పెరిగినట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. దీంతో సామాన్యులు ఏ కూరగాయ కొందామన్నా ఎంతో ఇబ్బంది పడుతున్నారు.