Veera Vanita Chakali Ailamma’s fighting spirit is an inspiration for women’s power Additional Collector of Institutions J. Aruna
పెద్దపల్లి, సెప్టెంబర్ -26: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
వీర వనిత చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ అన్నారు.
గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ సంఘ సేవకురాలుగా, భూమి, సాయుధ రైతాంగ పోరాటంలో ప్రదర్శించిన పోరాట పటిమతో వీర వనితగా చరిత్రలో నిలిచి, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు.
సమాజహితం కొరకు పోరాడిన మహనీయుల స్ఫూర్తి, వారి త్యాగాలు, గొప్పతనం ప్రజలకు తెలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచి, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని, మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అటువంటి వీర వనితను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి అనిల్ కుమార్, రజక సంఘ నాయకులు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.