TRINETHRAM NEWS

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తేది:-25-12-2024

క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకోని పర్వతగిరి మండల పరిధిలోని ఏనుగల్లు గ్రామ సమీపంలోని బెరచా బాపిస్ట్ చర్చిలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

అనంతరం ఏనుగల్లు గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకురాలు తొర్రి పద్మ కుమారస్వామి పేద క్రైస్తవులకు చీరలను పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేయగా ప్రారంభించి పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ

క్రైస్తవ సోదర సోదరీమణులకు ఆ ఏసుక్రీస్తు కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారన్నారు

వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పాస్టర్ల కుటుంబాలకు నా సొంత నిధులతో సుమారు 700 మందికి బట్టల పంపిణీ చేశానన్నారు

నా నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగుల కోసం అంబేద్కర్ ఈ క్లాసెస్ అనే ఆప్ యాప్ ద్వారా ఆన్లైన్ లో విద్యార్థి విద్యార్థులకు కోచింగ్ ఇప్పించామన్నారు. ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలన్నారు

దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ బాటలు వేశాన్నారు

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జటోత్ శ్రీనివాస్, చౌటపల్లి పిఎసిఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్, మండల మహిళ అధ్యక్షురాలు మాసాని సువర్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకురాలు తొలి పద్మ – కుమారస్వామి, పాస్టర్ డేవిడ్, మాసాని రవి, భాస్కర్, తో పాటు దైవజనులు దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App