
హెలిఫ్యాడ్ ను పరిశీలిస్తున్న వైరా ఏసిపి రహమాన్, మధిర సీఐ వసంత్ కుమార్
నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఎర్రుపాలెం మండలంలో పర్యటించనున్న సందర్భంలో హైదరాబాదు నుండి హెలికాప్టర్ ద్వారా ఎర్రుపాలెం మండలంను చేరుకోనున్నారు. ఈ సందర్భంగా పెద్ద గోపవరం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ మధిర సీఐ వసంత్ కుమార్ తో కలిసి వైరా ఏసిపి రహమాన్ పరిశీలించి ఆర్ అండ్ బి అధికారులకు పలు సూచనలు చేశారు.హెలిఫ్యాడ్ పనులను మధిర టౌన్ ఎస్ఐ రాజేష్, ఎర్రుపాలెం ఎస్సై సురేష్ లు పరవేక్షిస్తున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు.అనంతరం మిషన్ భగీరథ పథకంపై అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించిన అనంతరం
హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రయాణం.
